రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న.. క‌మ‌ల్ హాస‌న్ కీల‌క నిర్ణ‌యం

-

త‌మ‌ళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్.. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, హింది భాషల‌లో సినిమాలు చేస్తు విశ్వ న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగ ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సొంతంగా మ‌క్క‌ల్ నీది మయ్యం అనే పార్టీని కూడా స్థాపించారు. కాగ ఈ పార్టీ స్థాపించిన నాటి నుంచి త‌మిళ‌నాడులో ఏ ఒక్క ఎన్నిక‌ల్లోనూ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. స్థానిక సంస్ధ‌ల ఎన్నిక నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల వర‌కు ఈ పార్టీ దార‌ణంగా విఫ‌లం అవుతూ వ‌చ్చింది.

అంతే కాకుండా.. డిపాజిట్లను కూడా కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీని కింది స్థాయి నుంచి బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. దాని కోసం త‌మిళ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌నలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసి.. 2024లో వ‌చ్చే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాగ క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ ఓటీటీ నుంచి కూడా త‌ప్పుకున్నారు. సినిమాల‌కు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు. రాజ‌కీయాల‌కే పూర్తి స‌మ‌యం కేటాయించాల‌ని క‌మ‌ల్ హాస‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version