ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం… ఆయుధాల కోసం 200 మిలియన్ డాలర్ల సాయం

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండు వారాలు పూర్తయ్యాయి. అయినా ఇంకా యుద్ధం ముగియలేదు. రష్యా ధాటికి ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. నగరాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. అందమైన నగరాలు ప్రస్తుతం మసి దిబ్బలుగా మారుతున్నాయి. రష్యాలాంటి పెద్ద దేశానికి రెండు మూడు రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నప్పటికీ.. దాదాపుగా రెండు వారాల నుంచి సమర్థంగా రష్యన్ ఆర్మీని ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ సేనలు. 

ఉక్రెయిన్, రష్యాను ఈ రేంజ్ లో ఎదుర్కోవడానికి ప్రధాన కారణం.. నాటో దేశాలు ముఖ్యంగా  అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. యుద్ధంలోకి దిగకున్నా.. తమకు ఉన్న అత్యాధునికి ఆయుధాలు, క్షిపణులు, నిఘా పరికరాలను ఉక్రెయిన్ కు అందించడంతో రష్యాకు ఎప్పటికప్పుడు చెక్ పడుతోంది. తాజాగా మరోసారి అమెరికా, ఉక్రెయిన్ కు భారీ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఏకంగా 200 మిలియన్ డాలర్లను ఉక్రెయిన్ కు సాయంగా అందించనుంది. అదనపు ఆయుధాలు, పరికరాల కోసం ఈ నిధులు వెచ్చించనుంది ఉక్రెయిన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version