ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యుద్దాన్ని అపడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి కూడా యుద్దం నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరింది. అయినా ఫలితం లేదు. ఉక్రెయిన్ ను నిరాయుధాంగా చేయడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే.. ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే.. తాజాగా.. ఉక్రెయిన్ రాజధాని కైవ్ వైపు వస్తున్న రష్యా మిలటరీ కాన్వాయ్ ముందుకు రాకుండా ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఉక్రేనియన్ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే రష్యా దళాలు ఉక్రేనియన్ రాజధానిలోకి ప్రవేశించగా…చాలా ఉక్రెయిన్ సైనికులు మరణించారు. కానీ ఈ ఉక్రెయిన్ పౌరుడు మాత్రం… అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా… రష్యా సైనిక దళాలను… ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ.. రష్యా సైనికులు మాత్రం… అతన్ని పక్కకు తోసిసి.. మరి వెళ్లారు. కాగా.. తాము ఉక్రెయిన్ ను కాపాడుకునేందుకు ప్రాణాలను కూడా ఆర్పిస్తామని జెలెన్స్కీ ప్రకటించారు.
✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB
— НВ (@tweetsNV) February 25, 2022