చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటుండు దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారన్నారు.
అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్ అని చురకలు అంటించారు.
కోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు. ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేశారు కేటీఆర్. చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.