రెండు భాగాలుగా “ఆన్ స్టాపబుల్” ప్రభాస్ ఎపిసోడ్!

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ షో ప్రోమోలు దుమ్ము రేపుతున్నాయి. జస్ట్ ప్రోమో రికార్డ్ వ్యూస్ అందుకుంది. ఈ షోలో ప్రభాస్ లోని రొమాంటిక్ యాంగిల్, ఎఫైర్స్ గురించి చర్చ జరిగిందని అర్థం అవుతుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్రభాస్ పెళ్లి విషయం కూడా చర్చకు వచ్చింది.

ఈ ముగ్గురు కలిసిన ఎపిసోడ్ సందడిగా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ షోలో తన పెద్దనాన్న కృష్ణంరాజు గురించి కూడా చెప్పి ఎమోషనల్ అయ్యారు ప్రభాస్. ఇక బాలకృష్ణ రామ్ చరణ్ కి ఒక ఫోన్ కాల్ చేయగా ప్రభాస్ గురించి ఓ ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం కంటెంట్ బాగుండడంతో ఎడిట్ చేసేందుకు ఎవరు ఒప్పుకోవట్లేదు. దీంతో ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి రిలీజ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 30వ తేదీన, రెండవ భాగాన్ని జనవరి 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆహా.

Read more RELATED
Recommended to you

Exit mobile version