పవన్ కళ్యాణ్ మీద నాకు ఆ ఆశ వుంది : ఉండవల్లి

-

ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు. మన రాష్ట్రం మీద ఆధారపడి కేంద్రం వుంది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇదే అదును.. ఇప్పుడే డిమాండ్స్ సాధించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లా ప్రకారం వెళుతుందనే నమ్మకం నాకుంది. కానీ విభజన సమయంలో కాంగ్రెస్ తప్పు చేసింది. మంచి ఐడియల్ సమయం ఇది. చంద్రబాబు టాక్టీస్ ఏ వ్యక్తి కి.. ఎవ్వరికీ ఉండవు. ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్. ఆయన తలచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాదనే నమ్మకం నాకుంది.

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ కూడా రాశాను. విభజన హామీ లో 75 వేల 50 కోట్లు రాష్ట్రానికి రావాలి. దీనిపై పార్లమెంటు లో ప్రస్తావించమని కోరాను. కేంద్రం తో పవన్ కళ్యాణ్ మాట్లాడితే పరిష్కారం వుంటుంది. పవన్ కళ్యాణ్ సాధిస్తారనే మీద నమ్మకం వుంది. ఇందులో సాధించడానికి లోకసభకు నోటీసు ఇవ్వాలి. నోటీసు ఎలా ఇవ్వాలో కూడా లేఖలో పేర్కొన్నా. అమిత్ షా దీనిపై చర్చించదానికి సిద్ధం అని చాలా సార్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటు లో చర్చించే నిర్ణయం తీసుకోవాలి. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం చేసిన రోజు ఇదే. 1లక్ష 42 వేల 600కోట్లు ఇంకా పంచలేదు. 42శాతం వాటా తెలంగాణకు వెళుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు విభజించ లేదు. ఎందుకో ఆశ పవన్ కళ్యాణ్ మీద వుంది అని ఉండవల్లి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news