కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా అన్ని రంగాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కాకపోతే చాలా శాతం మందికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగింది. వాటిలో భాగంగా వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా యువత వారి నైపుణ్యతను పెంపొందించుకోవచ్చు. దీంతో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పథకం ద్వారా వచ్చే రుణాన్ని ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్స్ కోసం ఉపయోగించవచ్చు లేక ఎటువంటి ఫీజు కొరకు అయినా ఉపయోగించవచ్చు. లైబ్రరీ ఫీజు, పరీక్షల ఫీజు, లేబరేటరీ ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు లేక పరికరాలు కొనుక్కోవడానికి ఇలా మొదలైన వాటి కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యార్థులకు ఉండే అవసరాన్ని తెలుసుకొని దాని ప్రకారం రుణాన్ని అందిస్తారు. దీంతో విద్యార్థికి ఉండే 90 శాతం ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా చేసే కోర్సులు రెండు ఏళ్ల వరకు ఉండవచ్చు మరియు నాలుగు లక్షల వరకు రుణం లభిస్తుంది. కానీ నాలుగు లక్షలకు మించి కోర్సుకు ఖర్చు అయితే దానిని విద్యార్థి భరించాలి.
ఈ పథకం లో ఇచ్చే రుణానికి సంబంధించి వడ్డీ సంవత్సరానికి ఒక శాతం ఉంటుంది మరియు దీనిని నేషనల్ సఫాయ్ కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్ణయించారు. పైగా ఈ రుణాన్ని తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించాల్సిన సమయం 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ విధంగా పథకానికి దరఖాస్తు చేసుకుని ఆ రుణాన్ని చదువు కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు అధికారిక వెబ్ సైట్ లో లభిస్తుంది. దానికి అప్లై చేసిన తర్వాత తగిన వివరాలుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి మొదలైన డాక్యుమెంట్లతో పాటుగా దరఖాస్తు చేసుకోవాలి మరియు కనీసం 18 ఏళ్లు నిండిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.