ఉండవల్లి ఫుల్ ఖుషీ: అన్నట్లే జరుగుతుంది!

-

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 350 పేజీల నివేదికను సీఎంకు కమిటీ ఛైర్మన్ నీరబ్ కుమార్ సమర్పించారు. అయితే ఈ నివేదిక పారిశ్రామిక పరంగా కొంగొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

భవిష్యత్తులో పరిశ్రమలు వాటి పరంగా తీసుకోవాల్సిన జగ్రత్తలు సూచించింది. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడూ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నివేదికలో స్పష్టం చేసింది. అలాంటి పరిణామాలు చోటుచేసుకుండా పారిశ్రామికంగా తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోకపోతే జరిగే పరిణామాలను సూచించింది. ఇది అంటే ఈ నివేదిక పారిశ్రామికంగా సరికొత్త పుంతలను తొక్కనుంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక సమర్పించిన తర్వాత నీరబ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ట్యాంక్ లో ఉష్ణోగ్రత పెరగడంతో హైప్రెజర్ ఏర్పడి గ్యాస్ లీకైందని స్పష్టం చేశారు. ట్యాంక్ డిజైన్, కూలింగ్ సిస్టమ్ సరిగా లేవని… సిబ్బందికి కూడా అవగాహన లేకుండా ఉన్నారని.. దీంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. 2019 డిసెంబర్ లో పైపింగ్ లో మార్పులు చేశారని… దీంతో మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయిందని కూడా వెల్లడించారు. నియంత్రణ వ్యవస్థలో కూడా లోపాలను గుర్తించామని, సేప్టీ బోర్డును ఏర్పాటు చేయాలని బోర్డుకు సూచించామని తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన తర్వాత సైరన్ కూడా మోగలేదని.. అసలు సైరన్ ఎన్నిసార్లు మోగాలి దాని కథాకమామిషు అంతా నీరబ్ కుమార్ వివరించారు.

అయితే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం వేరు. ఆ వచ్చిన నివేదిక ధైర్యంతో ప్రభుత్వం యథావిథిగా ప్రభుత్వం తాలూకూ వెబ్ సైట్స్ లో పెట్టడం వేరు. ఈ పని క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటనపై గతంలో మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుకున్నట్లుగా జరిగిపోయింది. దీంతో ఉండవల్లి ఖుషీఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఉండవల్లి ప్రభుత్వం తీసుకొచ్చే సరికొత్త మార్పులు, చేస్తున్న పనులూ, వాటి తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా వెబ్ సైట్ లో ఉంచాలని.. ప్రజలకు తెలిసే బహిరంగంగా పెట్టినప్పుడే పారదర్శక పాలన అందిస్తున్నట్లు లెక్క అనీ వెల్లడించారు.

దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిజాయితీ పాలనపై.. పారదర్శకత నివేదికపై.. ధైర్యంగా ఉండవల్లి వంటి మేధావుల కోసం ప్రభుత్వం నివేదికను అందరికీ అందుబాటులో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఒక్క నివేదక విషయం ద్వారా జగన్ పాలన ఏపాటి పారదర్శకతతో ముందుకు వెళ్తుంది అన్నది అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version