మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ BRS పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిని వ్యతిరేకించే ఏ పార్టీకి అయినా ఓటు వేస్తాను అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. బిఆర్ఎస్ వచ్చి పార్టీ పెట్టి బిజెపిని వ్యతిరేకిస్తాను అంటే మంచి ఛాన్స్ ఉందంటే వాళ్లకే వేస్తాను అన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేకపోతే నోటాకు ఓటు వేస్తాను అన్నారు.
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ,అఖిలేష్ యాదవ్, స్టాలిన్ లు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారని స్పోక్స్ మెన్ గా కెసిఆర్ తో సమానంగా ఎవరు ఉండరని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరన్నారు. పార్టీ సక్సెస్ అవుతుందో లేదో తెలియదని, వాయిస్ మాత్రం ప్రజలకు చేరుతుంది అన్నారు ఉండవల్లి. గతంలో కేసీఆర్ పిలిచి మాట్లాడారని, అన్ని విషయాలు తనతో చెప్తారన్నారు. పార్టీ వైపుగా ఎందుకు ఆలోచన చేశారో వివరించారన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.