నేటి నుంచి అండర్-19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీని మొదటి సారి కరేబియన్ దీవులు అతీథ్యం ఇస్తున్నాయి. ట్రినిడాడ్, గయానా, అంటిగ్వా, సెయింట్ కిట్స్ దీవులలో ఈ అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఈ మెగా టోర్నీలో యువ టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దుగుతుంది. యువ టీమిండియా ఇప్పటికే 2000, 2008, 2012, 2018 లలో టైటిల్ కొట్టి డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ మెగా టోర్నీని ఆడుతుంది.
ఈ యువ టీమిండియా కు ఢిల్లీకి చెందిన యష్ ధుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ గా తెలుగు యువకుడు రషీద్ ఉంటున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు ఆడుతున్నాయి. నాలుగు గ్రూప్ లలో నాలుగు జట్లు ఉండనున్నాయి. కాగ యువ టీమిండియా గ్రూప్ బీ లో ఉంది. ఈ గ్రూప్ బీ లో టీమిండియా తో పాటు ఐర్లాండ్, ఉగాండ, సౌతాఫ్రికా ఉన్నాయి.
అయితే ఈ గ్రూప్ లో ఎక్కువ విజయాలు సాధించి టాప్ రెండు జట్లు క్వార్టర్స్ ఆడుతాయి. కాగ తొలి రోజు వెస్టిండీస్ – ఆస్ట్రేలియా తో పాటు శ్రీలంక, స్కాంట్లాండ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ తొలి పోరులో ఈ నెల 15 న సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది. అలాగే ఈ నెల 19న ఐర్లాండ్, 22 న ఉగాండతో భారత్ ఆడనుంది.