అండర్ -19 ప్లేయర్‌ రషీద్ కు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్

-

గుంటూరు : హోంమంత్రి మేకతోటి సుచరితను టీమిండియా అండర్ -19 క్రికెట్ వైస్ కెప్టెన్ రషీద్ తండ్రి బాలీషా కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని హోం మంత్రి సుచరిత కొనియాడారు.. రషీద్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారన్నారు.

సాధారణంగా ఆటలపై దృష్టి పెట్టిన విద్యార్థులను ప్రోత్సహించే తల్లిదండ్రులు అరుదుగా ఉంటారని స్పష్టం చేశారు. రషీద్ లోని టాలెంట్ తో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ముఖ్యమేనని చెప్పారు హోంమంత్రి మేకతోటి సుచరిత.

రషీద్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తో మాట్లాడి రషీద్ కు అందాల్సిన అన్ని ప్రోత్సాహకాలను అందిస్తామని స్పష్టం చేశారు. రషీద్‌ కుటుంబానికి అన్ని వేళలా సహాయం చేస్తామన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత.ఇలాంటి క్రీడాకారులను ఏపీ సీఎం జగన్‌ ఎప్పుడూ.. ఆదరిస్తారని చెప్పారు హోం మంత్రి సుచరిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version