మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడను గులాబీ నేతలు ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఇటీవలే కాంగ్రెస్ నాయకులు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా మాజీ మంత్రి వ్యవహరించారని ఫైర్ అయ్యారు.ఇలాంటి ఘటనలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని అందులో వెల్లడించారు.రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా మాజీ మంత్రిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేత మన్నె క్రిశాంక్, కేటీఆర్ పీఏ తిరుపతి, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరగా.. అడిషనల్ డీజీపీ ఏ చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.