UNICEF ఇండియా: వ్యాక్సిన్ల గురించి సందేశాత్మక వీడియో…!

-

వ్యాక్సిన్ల వల్ల మనం వైరస్ నుండి సురక్షితంగా ఉండగలం. ఎటువంటి వైరస్లు మనకి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రాణాంతకమైన వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు బాగా ఉపయోగపడతాయి. UNICEF ఇండియా తాజాగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. దానిలో చాల ముఖ్యమైన సమాచారం వుంది.

పోలియో వ్యాక్సిన్ మరియు అది ఎలా పని చేస్తుంది అనేది చూద్దాం..!

ఎప్పుడో వంద సంవత్సరాల ముందు చూసుకుంటే ప్రాణాంతకమైన సమస్యల్ని కూడా వ్యాక్సిన్ తో పరిష్కారం చూపించడం జరిగింది. మానవులు విజయవంతంగా వ్యాక్సిన్లు కనుగొన్నారు. ఉదాహరణకి పోలియో.. పోలియో వైరస్ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకింది.

వందల మంది వేల మంది ప్రజలు పక్షవాతానికి గురయ్యారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఆ వైరస్ లకు కూడా ఇవ్వడం జరిగింది.

1950 నాటికి రెండు విజయవంతమైన వ్యాక్సిన్లు కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి దేశాల్లో పోలియో ని తరిమి కొట్టడం జరిగింది. వందల మంది వేల మంది పిల్లలకి వ్యాక్సిన్లు వేశారు. నిజంగా ఇప్పటికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇటువంటి వ్యాక్సిన్స్ కారణంగా ఇప్పుడు పోలియో రాకుండా ఉంటోంది. మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా పోలియో ఫ్రీ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version