కేంద్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు పూర్తి అయింది. ఎల్లుండి ఉ. 10 : 30 కి కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్ విస్తరణలో కొత్తగా 20 మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యతగా ఇవ్వునున్నారు ప్రధాని మోడీ. కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 81 మందికి అవకాశం కల్పించే యోచనలో ఉంది. ప్రస్తుతం 53 మందితోనే మంత్రి వర్గం కార్యకలాపాలు చేస్తున్నది.
మిగిలిన 28 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కేబినేట్ విస్తరణ ఉహాగానాలతో.. ఢిల్లీకి జ్యోతి రాదిత్య సింధియా, సోనోవాల్, సుశీల్ కుమార్ మోడీ, లోక్ జనశక్తిలో చీలిక తెచ్చిన పరాశకు అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు.. బీజేపీ పార్టీ మిత్ర పక్షాలకు చెందిన వారికి కూడా ఈ విడత కేబినెట్ లో స్థానం ఇవ్వనున్నారు. ఇక ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరి కూడా ఛాన్స్ లేనట్లే తెలుస్తోంది.