కేంద్ర మంత్రి వర్గ సమావేశం చూసారా…?

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటకే కేంద్రం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఎవరిని కూడా బయటకు రానీయడం లేదు. లాక్ డౌన్ ని ఏకంగా మూడు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా ఎవరిని కూడా రోడ్ల మీదకు అనుమతించవద్దు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి వర్గం సమావేశ౦ అయింది. ఈ సమావేశంలో కరోనా లాక్ డౌన్ పై మంత్రులు సమావేశం అయ్యారు. ప్రధాని మంత్రులతో అన్ని విషయాలను చర్చించారు. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలని మంత్రులతో ప్రధాని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ పై చర్చలో భాగంగా మంత్రులు అందరూ దూరం దూరంగా కూర్చున్నారు.

సమావేశం ఆసాంతం కూడా మంత్రులు అందరూ మూడు అడుగులు దూరంగా కూర్చున్నారు ప్రధాని కేంద్ర మంత్రులు. సీట్లను కూడా అదే విధంగా ఏర్పాటు చేసారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చలు జరిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version