విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ.. ఎప్పుడంటే..?

-

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హోంశాఖ సమాచారం పంపింది. ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాలని కోరింది. భేటీలో విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం6 నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో సెప్టెంబర్‌ 27న భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై కేంద్రం చర్చించింది. ఏపీకి సంబంధించి ఏడు అంశాలపై కేంద్ర అధికారులు చర్చించారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. ఆ నిబంధనకు అనుగుణంగా రెండేళ్లలో చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి కానుంది. గత ఎనిమిదేళ్లు పలు సమస్యలు ఇంకా పెండింగ్‌ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలపై ఏ కొలిక్కి రాలేదు. ఈ సారైనా విభజన సమస్యలకు పరిష్కారం దొరకాలని తెలుగు రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version