మావోయిస్టుల ఫోన్ లు ట్యాప్ చేయాల్సింది పోయి మా ఫోన్లు ట్యాప్ చేశారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణకు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ సిట్ అధికారులకు ఆధారాలు సమర్పించే సమయంలో నేనే షాక్ కి గురయ్యా అన్నారు.

కేవలం నా ఒక్కడి ఫోనే అనేక సార్లు ట్యాప్ చేశారు… ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హరీష్ రావు, కవిత కూడా ఉన్నారని బాంబు పేల్చారు. వావీవరసలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అందరి కంటే ముందు బయటపెట్టిందే నేను అన్నారు బండి సంజయ్. నా ఫోనే ఎక్కువ సార్లు ట్యాప్ చేశారు… కేవలం నాదే కాదు నా కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే సిబ్బంది, నా అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం, సిట్ పై నాకు నమ్మకం లేదని పేర్కొన్నారు.