ఎన్టీఆర్ పేరుతో జిల్లాను తెచ్చిన జగన్ తండ్రి విగ్రహం తొలగించారు. అర్ధరాత్రి నందిగామ గాంధీ సెంటర్ లో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలగించారు. ఎలాంటి సమాచారం లేకుండా విగ్రహం తొలగించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు షర్మిల కూడా ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వానికి YCPపై కోపాన్ని YSR గారి విగ్రహాల మీద చూపిస్తారా ? అని నిలదీశారు. అసలు YCPకి YSRకి ఏం సంబంధం ? మహానేత పేరు పెట్టినంత మాత్రాన YSR ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా ? ఆగ్రహించారు.

YSR గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా – నిర్దేశం YSR గారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య ? అని ఫైర్ అయ్యారు.