తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.
అమిత్ షా ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శిచారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకున్న అమిత్ షా.. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలను సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన తుక్కుగూడలో బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బయలు దేరారు.