వావ్ : కేఏ పాల్ తో అమిత్ షా ? కేసీఆర్ పై కంప్లైంట్ !

-

వివాద‌స్ప‌ద మ‌త పెద్ద, ప్ర‌పంచ శాంతి దూత కేఏ పాల్ మ‌రో ఆస‌క్తిక‌ర వార్త‌తో నిన్నటి వేళ మీడియాలో సంద‌డి చేశారు. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు. ఎప్ప‌టి నుంచో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డిస్తూ, త‌న‌కు అవ‌కాశం ఇస్తే ఆంధ్రాకు ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు తెస్తాన‌ని, అదేవిధంగా గ‌తంలో తెలంగాణ‌కూ తీసుకువ‌చ్చాన‌ని చెప్పారు. అయితే ఇటీవ‌ల ఆయ‌న కేసీఆర్ పై పోరు తీవ్ర‌త‌రం చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి ఇటీవ‌ల నిర్వహించిన ప్లీన‌రీ వేళ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశార‌ని, వీటిని వెంట‌నే చించేయాల‌ని వివిధ విప‌క్ష పార్టీలకు చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఇదే అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చింది.

స‌మ‌యం లేక‌పోవ‌డంతో తాను హై కోర్టుకు వెళ్ల‌లేక‌పోతున్నాను అని కూడా చెప్పారు. త‌రువాత హైకోర్టుకు  కూడా వెళ్లారు. ఇదంతా రాజ‌కీయంగా పెను దుమారం రేపింది. ఆ త‌రువాత ఓ సంద‌ర్భంలో కేఏ పాల్ మాట్లాడుతూ ఉండ‌గా టీఆర్ఎస్  కార్య‌క‌ర్త ఒక‌రు ఆయ‌న చెంప చెళ్లుమ‌నిపించారు.

ఈ ఘ‌ట‌న కూడా బాగా వైర‌ల్ అయింది. ఆయ‌న ఏ  పార్టీకి చెందిన వ్య‌క్తి అయినా కానీ ఈ విధంగా భౌతిక దాడుల‌కు పాల్ప‌డ‌డం త‌గ‌ద‌ని ప‌లువురు హితవు చెప్పారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లిసి నిన్న‌మొన్న‌టి ఘ‌ట‌న‌ల‌తో పాటు తెలంగాణ‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు అన్నింటినీ వివ‌రించారు కేఏ పాల్. అదేవిధంగా ఆంధ్రా, తెలంగాణ ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న అప్పులు వాటి వ్య‌వ‌హారాల‌పై కూడా కేఏపాల్ కంప్లైంట్ చేశార‌ని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జ‌గ‌న్ వ‌ర్గాల‌నూ క‌ల‌వ‌ర పాటుకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల‌లో అప్పులు తారా స్థాయికి చేరుకున్నాయ‌ని ఇప్ప‌టికే కేంద్రం నెత్తీ నోరూ మొత్త‌కుంటున్న త‌రుణంలో ఆ వాద‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విధంగా కేఏ పాల్ ఫిర్యాదు ఉండ‌డంతో ఇప్పుడిక రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్క‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version