బిజినెస్ ఐడియా: మహిళ ఫుడ్ ఐడియా అదిరింది..2 వేలతో స్టార్ట్ చేసింది.. ఇప్పుడు..

-

మహిళలు ఎందుకు పనికిరారు అన్న మగవాళ్ళు ఇప్పుడు వారిని చూసి అసూయ పడే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది మహిళలు వారికి ఉన్న ఐడియా లతో బిజినెస్ లు మొదలు పెట్టి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళను చూసే ఉంటారు.తాజాగా మరో మహిళ చిన్నగా మొదలు పెట్టిన బిజినెస్ ఇప్పుడు కోట్లను సంపాదించి పెడుతుంది..వావ్..ఒక మహిళ ఇలా కోట్లు సంపాదిస్తుంది. అంటే అభినందించాల్సిన విషయమే..

అసలు ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..మహారాష్ట్రలోని థానేకు చెందిన లలితా పాటిల్ భర్త గ్యాస్ ఏజెన్సీని నడిపే వాడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. సాధారణ జీవనశైలితో బతికేవారు. గ్యాస్ ఏజెన్సీతో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించే వారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ పైప్‌ లైన్‌ లు వేయడంతో లలితా పాటిల్ భర్త వ్యాపారం నష్టాలు ఎదుర్కొంది. వ్యాపార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడూ ఒక బిజినెస్ పెట్టి స్వతంత్రంగా జీవించాలనుకునే లలితా పాటిల్ కుటుంబాన్ని తన బాధ్యతగా భావించింది.ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన లలిత ఎప్పుడూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది.

ఆ ఆలోచనతో ఆమె 2 వేలు పెట్టి ఇంట్లో తయారుచేసిన సాధారణ ఆహారాన్ని అందించడానికి తన టిఫిన్ సేవలకు ఘరాచీ అథవన్ లేదా ‘మెమొరీస్ ఆఫ్ హోమ్’ అని పేరు పెట్టింది. ఏడాది పాటు అంతా బాగానే సాగింది. వ్యాపారం కూడా మంచి లాభాలనే తెచ్చి పెడుతోంది. కానీ తనను ఇంకా అందరూ ఒక గృహిణిగానే చూస్తున్నారని గ్రహించింది.రెస్టారెంట్‌లో రూ. 6 లక్షలు పెట్టుబడి పెట్టింది.చాలా కష్టాల తర్వాత, థానే రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న టీజేఎస్బీ బ్యాంక్ సమీపంలోని కోప్రి రోడ్‌లో తగిన స్థలాన్ని కనుగొంది.ఇంటికి దూరంగా ఉండే వారినే మొదట లక్ష్యం చేసుకుంది లలితా. విద్యార్థులను, ఉద్యోగాలు చేసే వారు తన దగ్గరికి రావడం మొదలు పెట్టారు..అలా ఆమె బిజినెస్ అంచెలంచెలుగా ఎదిగింది..ఇప్పుడు ఏకంగా ఏడాదికి కోటి రూపాయలు అర్జిస్తుంది..ఒక గృహిణి ఇలా కోట్లు సంపాదించడం పై అందరు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version