తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్ఎంసీ పాలిస్తుంది. రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలి. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుంది. జీహెచ్ఎంసీ బాదేంటో నాకు తెలుసు. పాత కాంట్రాక్టర్లకే బిల్లులు రాకపోతే కొత్త కాంట్రాక్టర్లు ఎలా వస్తారు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుంది.
అయితే పేదల్లో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. ఉస్మానియా హాస్పిటల్ ఉన్నచోటనే గొప్ప హాస్పిటల్ గా కట్టొచ్చు. ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉన్న ఆలయాన్ని తరలించి అక్కడే హాస్పిటల్ కట్టొచ్చు. నగరంలో ఉన్న నీటి వనరులన్నీ మురికిగా మారాయి. హైదరాబాద్ లో దుర్గందభరిత వాతావరణం లేకుండా చూడాలి. నగరంలో నేను చూసిన అనుభవాలతో జీహెచ్ఎంసీకి లేఖ రాస్తాను. పాలక మండలిపై ప్రజల్లో విశ్వాసం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. జీహెచ్ఎంసీ పైసలు లేవని చెబితే పరువుపోతుంది అని ఎంపీ ఈటల అన్నారు.