సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..!

-

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో ప్రధానంగా ప్రస్తుతం హైడ్రా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అక్రమ కట్టడాలు, చెరువు కబ్జాల ద్వారా ఆక్రమించుకున్నటువంటి వాటిని కూల్చివేస్తోంది హైడ్రా. నిన్న ప్రభుత్వం హైడ్రా కోసం కొత్తగా 169 పోస్టులను కూడా నియమించిన విషయం విధితమే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

హైడ్రా దూకుడు పేదల పై కాకుండా..ఆక్రమించుకున్న వారిపై చేపట్టాలన్నారు.  30 ఏళ్ల కింద నిర్మించుకున్న ఇల్లు అక్రమం అని  సర్కార్ కూల్చివేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  రాత్రికి రాత్రి కట్టుబట్టలతో వాళ్లు రోడ్డున పడితే వారికి దిక్కు ఎవ్వరూ అన్నారు. పేదలతో ఒక సారి చర్చలు జరిపిన తరువాత వారికి ప్రత్యామ్నంగా మరో చోట స్థలం లేదా ఇల్లు చూపించి.. ఆ తరువాత కూల్చివేతలు చేపడితే బెటర్ అని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version