కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న కేంద్ర మంత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రికి కరోనా సోకగా, తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ కు కరోనా నిర్దారణ అయింది. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.