విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈ విషయన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘గడ్కరీ గారికి కరోనా సోకడంతో రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. కాని ప్రజావసరాల దృష్ట్యా ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది” అని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాస్తవానికి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో సంతాప దినాలు కొనసాగుతున్నందున ప్రారంభం వాయిదా పడింది. అనంతరం ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వంతెన ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, మళ్ళీ వాయిదా పడింది. ఈ ఫ్లైఓవర్ గనుక ప్రారంభం ఐతే విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తిరినట్టే.
గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది. pic.twitter.com/7Kb4Zpo8XO
— Kesineni Nani (@kesineni_nani) September 17, 2020