తన పంజాబ్ పర్యటనలో భాగంగా లూథియానాలో తనకు ప్రయాణం చేసే సమయంలో ఊపిరి ఆడలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆవేదన వ్యక్తం చేసారు. చలికాలంలో ఢిల్లీ కాలుష్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హిమాలయాల నుంచి వచ్చే గాలి, ఉత్తర భారతంలో ఉండే దుమ్ము కాలుష్యంతో ఇప్పుడు కాలుష్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవి అన్నీ కలగలిసి కాలుష్య తీవ్రత పెరుగుతుందని ఆయన వివరించారు. పంజాబ్ లో పంటలను కాల్చడమే దీనికి ప్రధాన కారణం అని కాబట్టి అక్కడి ప్రభుత్వం పంటలు కాల్చే వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వచ్చేది చలి కాలం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు జాగ్రత్తగా చేపట్టింది.