నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోమారు కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

జేఈఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోందన్నారు. ఇకపోతే ప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు జేఈఈ మెయిన్ పరీక్షలు, సెప్టెంబ‌ర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఐఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను షెడ్యూల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version