కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ ఘోర ఓటమి

-

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి ఉత్తరప్రదేశ్లోని ఆమేథీలో తిరిగి కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది.కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ చేతిలో కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ ఘోర ఓటమి పాలయింది. దాదాపు లక్ష ఓట్ల పై చిలుకు తేడాతో స్మృతి ఇరానీ పరాజయం పాలైంది. గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి దేశ రాజకీయాల్లో సెన్సేషన్ సష్టించారు స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీపై గెలవడంతో దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ పేరు మారుమోగిపోయింది .

రాహుల్ గాంధీపై విజయం సాధించడంతో స్మృతి ఇరానీని కేంద్రమంత్రి పదవి కూడా వరించింది. తాజా ఎన్నికల్లో మరోసారి స్మృతి ఇరానీ ఆమేథీ నుండి పోటీ చేయగా కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీని కాకుండా మరో బలమైన నేత కిశోరీలాల్‌ శర్మను ఎన్నికల బరిలోకి పంపించింది. బీజేపీపై వ్యతిరేకతతో పాటు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి రావడంతో కిషోర్లాల్ శర్మ విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news