తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలకపోయింది. అయితే తాజాగా విడుదలైన ఎంపీ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గత 24 ఏళ్లలో అనేక ఒడిదొడుకులు, మధురమైన విజయాలను చూశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమకు అతి పెద్ద మైలు రాయి. ప్రాంతీయ పార్టీగా తాము 2014లో 119 స్థానాలకు 63, 2018లో 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 119 స్థానాల్లో 39 సీట్లు, అంటే ఒకటిలో మూడో వంతుతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు వెలువడిన ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కానీ రానున్న కాలంలో బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా తప్పకుండా పైకి లేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.