తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. కేంద్ర మంత్రులే తమ ప్రభుత్వ పాలనను పొగుడుతున్నారని అన్నారు. మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలను తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలోని రాయచూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే.. ఏకంగా తన మొత్తం నియోజక వర్గాన్నే తెలంగాణలో కలపాలని అడుగుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఉన్న అందరి బీజేపీ నాయకులకు కనిపిస్తుందని అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు అందరికీ తెలిసేలా.. ప్రచారం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకం, అభివృద్ధి పనులను కింది స్థాయికి చేరేలా కార్యకర్తలు ప్రయత్నం చేయాలని అన్నారు. లేకుంటే ప్రతి పక్షాలు చేసే అబద్ద ప్రచారాలే నిజమని నమ్మే అవకాశం ఉందని అన్నారు.