ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్షాకాల సమావేశాలకు ముందు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా ఈ రోజు రెండు నిర్ణయాలు తీసుకుంది, ఒకటి దేవాదాయ శాఖా ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును పెంచడం మరియు యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ ల రిటైర్మెంట్ వయసును పెంచడం.. ఈ రెండు నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ కాబినెట్ కూడా ఆమోదాన్ని తెలిపింది. తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీ లలో ఇప్పటికే ఉన్న భోదనం సిబ్బంది కొరతను తీర్చడం కోసం కాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఇప్పటి వరకు ప్రొఫెసర్ ల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ చట్టంలో మార్పులు చేసి ఆ రిటైర్మెంట్ వయసును 62 నుండి 65 కు మార్చడం జరిగింది.
యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంపు…
-