మూర్ఛవ్యాధికి, తాళాలకు మధ్య సంబందం ఏంటి?

-

మూర్ఛవ్యాధి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కారణాలు తెలియదు కాదు. మూర్ఛ వచ్చిన వ్యక్తి నోటి నుంచి మాత్రం నురుగ వస్తుంది. దీన్ని చూసి మరింత ఖంగారుపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఇలా జరుగుకుండా ఉండడానికి పూర్వీకుల కాలం నుంచి మూర్ఛవచ్చిన వ్యక్తి చేతిలో తాళాలు గాని ఇనుపరాడ్ గానీ పెడుతారు. ఇలా పెట్టగానే ఫిట్స్ ఆగుతాయా? పెట్టకపోయినా ఆగుతయా? అనే సందేహాలు తెలుసుకుందాం.

ఫిట్స్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కన్పించవు. కాబట్టి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది. మూర్చ వచ్చిన వెంటనే ఎవరైనా ఇనుప తాళాల కోసం తెగ వెతుకుంటారు. ఎందుకంటే మూర్ఛను కంట్రోల్‌లో పెట్టే శక్తి ఒక్క ఇనుప వస్తువుకు మాత్రమే ఉందని అందరి అభిప్రాయం. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు న్యూరో సర్జన్ నిపుణులు. ఇంకా నిజం చెప్పాలంటే.. ఎవరికీ మూర్ఛ వచ్చినా అది 2 నుంచి 5 నిమిషాలలోపే ఉంటుందట. ఈలోపు ఖంగారు పడి ఎక్కడో చోట తాళాలు గాని, ఇనుప వస్తువు చేతిలో పెడుతాము. 5 నిమిషాల వ్యవధిలో కాళ్లు, చేతులు ఆడించడం ఆగుతుంది. దీంతో తాళాలు బాగా పనిచేశాయనుకుంటాం. తాళాలు పెట్టినా పెట్టకున్నా ఫలితం ఒకేలా ఉంటుంది.

జాగ్రత్తలు :
తాళాలు, ఇనుప రాడ్‌లు మూర్ఛవ్యాధిని ఆపలేదు కాబట్టి, ఆ సమయంలో ఏం చేయాలంటే.. మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి. ఫిట్స్‌తో కొట్టుకుంటూ కాళ్లు, చేతులు అటూ ఇటూ వేగంగా కదిలించినా అలానే వదిలేయాలి. ఆపడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ ఆపినట్లయితే వారికి సడెన్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మూర్ఛ వచ్చిన రోగి నోట్లో నురగ వస్తుంది. దాన్ని ఆపడానికి నోట్లో ఎలాంటి వస్తువులు, దుస్తులను పెట్టకూడదు. వారికి వాంతింగ్ చేసుకుంటుంటే చేయనివ్వాలి. రోగికి తగినంత గాలి తగిలేలా చూడాలి. వైద్యుని దగ్గరకు వెళ్లేంతవరకు ఈ చిన్నపాటి చికిత్స చేస్తే ఆ వ్యక్తి కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version