ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి.. చివరిసారిగా ఏం చెప్పిందంటే..

-

ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఉన్నావో బాధితురాలు మరణించే ముందు సఫ్దర్‌గంజ్‌ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చివరిసారిగా తన సోదరుడితో మాట్లాడారు. ‘‘నాపై సామూహిక అత్యాచారం చేసి, నిప్పంటించిన నిందితులను విడిచి పెట్టవద్దు’’ అని ఉన్నావో బాధితురాలు తన సోదరుడిని కోరింది. తనకేమైనా అయినా నిందితులకు శిక్ష పడేలా చేయి అని బాధితురాలు మరణించే ముందు చివరిసారి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న సోదరుడు కన్నీరుముననీరుగా రోదిస్తున్నారు.

 

కాగా, గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆమె మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version