Unstoppable: బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్స్ ఇవే..!

-

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ షో కి బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ రెండవ సీజన్లో సినిమా సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు కూడా వచ్చి సందడి చేస్తున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని ప్రభాస్ ఇప్పుడు బాలయ్య కోరిక మేరకు అన్ స్టాపబుల్ షో కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాహుబలి ఎపిసోడ్ తొలిభాగం 45 నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో ఇద్దరి మధ్య పలు ఆసక్తికరమైన సంగతులు, సంఘటనలు చోటుచేసుకున్నాయి . ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి.. టైం వచ్చినప్పుడు చెబుతానన్న ప్రభాస్.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు ఆ మేడం కృతి సనన్ కాదని క్లారిటీ ఇచ్చాడు. ఫోటో చూపించగా అదంతా ఒట్టి ప్రచారం అని ఆమె స్వయంగా చెప్పినా దీని గురించి డిస్కషన్ అవసరం లేదు అని కుండబద్దలు కొట్టాడు. మరొకవైపు బాలకృష్ణ.. అనుష్క పేరు నేరుగా చెప్పకపోయినా ఆయన అడిగిన ప్రశ్నకు లేదంటూ దాటవేసి.. ఫోన్ కాల్ ద్వారా రామ్ చరణ్ సహాయం తీసుకుందాం అనుకున్నా.. అది కూడా కామెడీగా రివర్స్ అయ్యింది.. ముందు బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన చరణ్.. త్వరలో డార్లింగ్ నోటి నుంచి గుడ్ న్యూస్ వింటారని చెప్పి చెప్పక ఊరించి వదిలేశాడు.

మిర్చి , బాహుబలి, రెబల్ తాలూకు ముచ్చట్లు.. మిస్టర్ పర్ఫెక్ట్ క్లైమాక్స్ నచ్చక దిల్ రాజు 3 నెలలు వాయిదా వేసి రీ షూట్ చేయించడం.. చిరంజీవి , బాలకృష్ణ సినిమాల మధ్య వర్షం రిలీజ్ చేసేందుకు ఎమ్మెస్ రాజు ధైర్యం చేయడం.. లాంటివి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. కృష్ణంరాజు గురించి కూడా ఎన్నో విషయాలు ప్రస్తావన లోకి వచ్చాయి. మొదటి భాగం మొత్తం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ టాపిక్ మీద ఎక్కువగా వెళ్లడం కొంత ల్యాగ్ అయ్యింది.తర్వాత గోపీచంద్ ఎంట్రీ తో ఆ తర్వాత షో మరింత నవ్వులు పూయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version