నటసింహం నందమూరి బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు వారి ఓటీటీ ఆహాలో ఈ షో ప్రసారమవుతోంది. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా బాలయ్య అభిమానులను తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దీపావళి సందర్భంగా ఈ రోజు ప్రీమియర్ ను ప్రసారం చేశారు. కాగా ఈ షో లో సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలోనే మీకు మద్యం అలవాటు ఉందా అంటూ బాలయ్య మోహన్ బాబు ను ప్రశ్నించారు.
దానికి మోహన్ బాబు సమాధానమిస్తూ మద్యం అలవాటు ఉందని చెప్పారు. ఒకప్పుడు మద్రాసులో కోడం బాక్కం వంతెన కింద ఉన్న సారా దుకాణాల్లో సారా తాగాను అని చెప్పారు. ఆ తర్వాత తనకు మంచి రోజులు ఇచ్చాడని..దాంతో కాస్త మంచి విస్కీ తాగుతున్నా అని చెప్పాడు. ఇక షో లో మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి మరియు విష్ణు కూడా హాజరయ్యారు. దాంతో షో మొత్తం సరదాగా సాగిపోయింది. లక్ష్మీ విష్ణు లను కూడా బాలయ్య పలు ప్రశ్నలు వేసి అలరించారు.