పవన్ కల్యాణ్ కు మంత్రిత్వ శాఖల కేటాయింపు.. అభినందనలు తెలిపిన యూపీ సీఎం

-

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం పార్టీ-జనసేన-బీజేపీ ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు (శుక్రవారం) శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.జనసేన చీఫ్, కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి గేమ్ ఛేంజర్‌గా మారిన పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, సైన్స్ అండ్ టెక్నాలజీ,పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాఖలు కేటాయించారు.

కాగా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఇక, తమ అభిమాన నేతకు యూపీ సీఎం యోగి విషెస్ తెలపడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version