ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ కేసు: యోగి ఆదిత్యనాథ్

-

ఉన్నావ్ ఘటనపై యావత్ ఉత్తరప్రదేశ్ అట్టుడుకిపోతోంది. నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ ఆధ్వర్యంలో సమాజ్‌వాది పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అసెంబ్లీ గేటు వద్ద అఖిలేష్ బైఠాయించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గుర్తు చేశారు. నిందితులుగా ఉన్న ఐదుగురికి శిక్ష పడుతుందని అంటున్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున.. న్యాయవాదిని కలిసేందుకు వెళుతుండగా బెయిలుపై బయటికి వచ్చిన దుండగులు బాధితురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఆ బాధిత యువతిని హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news