పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వీడియో వైరల్‌

-

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సహజంగా పెళ్లిళ్లు జరిగితే తల్లిదండ్రులు… కలకాలం బాగుండాలని వారి పిల్లలను ఆశీర్వదిస్తారు. అయితే యూపీలో ఓ పెళ్లి కొడుకును.. అతని తల్లి అతన్ని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే యూపీకి చెందిన ఉమేష్ చంద్ర అనే యువకుడు.. తన ఇంటికి ఎదురుగా ఉన్న అంకిత అనే అమ్మాయిని గత కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే అంకితను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఈ వివాహం యువకుడి తల్లిదండ్రులు మరియు సోదరుడికి అస్సలు ఇష్టం లేదు. వారు ఎంత వద్దన్నా వినకుండా ఉమేష్ చంద్ర ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో యువతి తండ్రి భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ రిసెప్షన్ కార్యక్రమానికి వరుడి కుటుంబాన్ని ఆహ్వానించలేదు. దీంతో వారు కోపంతో రగిలిపోయాడు. ఈ రిసెప్షన్ కు ముసుగులో వచ్చిన వరుడు తల్లి.. ఒక్కసారిగా ఆ నూతన వధూవరులపై దాడి చేసింది. తన కొడుకును ఏకంగా చెప్పుతో కొట్టింది ఆ తల్లి. ఇది చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news