కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడం తో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రోజు రాత్రి పది గంటల నుంచి ఈ లాక్ డౌన్ ని ప్రారంభించనున్నారు. అయితే 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ లాక్ డౌన్ కొన సాగుతుంది అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
అత్యవసర సేవలు మినహా మిగిలిన ప్రైవేటు కార్యాలయాలు అన్నీ కూడా మూసి వేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 20 వేల మందికి పైగా కోలుకొని డిస్ ఛార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలియజేసింది. టెస్టులు సామర్థ్యాన్ని మరింత పెంచాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కోరారు. గత వారం కరోనా పరిస్థితి పై హర్యానా ఢిల్లీ యూపీ ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశములో అమిత్ షా పలు వాక్యాలు కూడా చేశారు.