సాక్షాత్తు తిరుమలలో నెలకొన్న శ్రీవారిని దర్శించుకోడానికి భక్తులు ఎప్పుడు ముందు ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వాళ్ల కష్టాలని శ్రీవారికి విన్నవించుకుంటే వల్ల కష్టాలు అన్ని తీరిపోతాయి అని భావిస్తారు. కానీ భక్తుల యొక్క నమ్మకాన్ని కొంతమంది మోసం చేస్తున్నారు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తామని కొంతమంది భక్తులను ఆన్లైన్ లో మోసం చేస్తున్నారు. అయితే ఇలా మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్‌పై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలోఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న రఘు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ప్రయత్నించాడు. ఆన్లైన్లో టీటీడీ పేరుతో ఒక వెబ్సైట్ కనిపించడంతో దర్శన టికెట్లుకోసం వివరాలు సమర్పించి ఆసైట్కు నగదు బదిలీ చేశాడు. నగదు బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక మెయిల్ ఐడీకీ దర్శన టికెట్లు పంపుతామని చెప్పి పంపించేశాడు. కానీ మెయిల్ కు ఎటువంటి మెసెజ్ అనేది రాకపోవడంతో అనుమానం వచ్చి ఆ బాధితుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇది నకిలీ వెబ్సైట్ గా గుర్తించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.