వికాస్ దూబేను పట్టిస్తే బహుమతి.. ఎంతంటే..!

-

గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ప‌ట్టిస్తే రూ.2.5 ల‌క్ష‌లు బహుమతి ఇస్తామ‌ని యూపీ పోలీసులు ప్ర‌క‌టించారు. వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ఇంతకు ముందు యూపీ పోలీసులు ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని పెంచిన‌ట్లు యూపీ డీజీపీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో వికాస్ దూబేనే ప్ర‌ధాన నిందితుడు. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాశ్‌ను ప‌ట్టుకునేందుకు డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి అత‌ని ఇంటికి  వెళ్లింది.

 

విషయం తెలుసుకున్న  రౌడీలు ముందే మాటువేసి దాడి చేశారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు చనిపోయారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ గ్యాంగ‌స్ట‌ర్ వికాశ్ దూబే ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇప్పటికే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని యూపీ పోలీసులు కల్యాణ్‌ పూర్‌ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version