ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో కేవ్ రాజ్ పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దుండగులు క్రూరంగా హత్యచేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో సామూహిక హత్యలు జరగడంతో ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపింది. హత్య అనంతరం దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. మంటలను గమనించి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా… ఐదురుగురు హత్య చేయబడి ఉన్నారు.
.