సాధారణంగా ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఆన్ లైన్ డబ్బులు తీసుకొని చెల్లించడం లేదని వేధింపులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు మనం నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించింది.
లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్రం. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నది కేంద్ర ప్రభుత్వం. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించింది సర్కారు. ఇది కనుక అమలైతే.. బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరనట్టే అని స్పష్టంగా తెలుస్తోంది.