హీరో అల్లు అర్జున్ కి సినిమా కలెక్షన్ల మీద తప్ప.. ప్రజలపై ధ్యాస లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించారు. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగవద్దనే ఉద్దేశంతో టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని స్పష్టం చేసారు. ఆరోజు సంధ్య థియేటర్ లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందనే ధ్యాస కూడా మీకు లేదని.. మీకు సినిమా కలెక్షన్ల పై ధ్యాస ఉంది తప్ప.. ప్రజలు ఏమైతుండ్రు బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ లో ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించే అలా మాట్లాడారని.. దానిపై మీరు రియల్ హీరోగా మాట్లాడలేకుండా స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదని.. మీరు మాట్లాడిన తీరు అలా ఉందన్నారు. ఒక సెలెబ్రిటీ అయి ఉంది.. బాధ్యత యుతంగా ఉండాలి. కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దని సూచించారు. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారని అనడం విడ్దూరంగా ఉందన్నారు ఎంపీ చాలా కిరణ్ రెడ్డి.