WPL : ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం

-

WPL : గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠ మ్యాచ్ లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఒకానొక దశలో యూపీ ఓటమి ఖాయమనుకున్న హరీస్ విధ్వంసం సృష్టించింది.

26 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 59* రన్స్ చేసి, తన జట్టును గెలిపించింది. కిరణ్ నవగిరే హాఫ్ సెంచరీతో రాణించింది. కిమ్ 5 వికెట్లు తీసింది. కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ… ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించింది. 224 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version