బేబీ బంప్‌తో ఫోటో షేర్‌ చేసిన ఉపాసన

-

మెగా కోడలు ఉపాసన కొణిదెల తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తమ ఇంటికి వారసుడు రాబోతున్నట్లు మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించగానే మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. రామ్‌చరణ్‌ తండ్రి కాబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచింది. పెళ్లైన పదేళ్ల తర్వాత గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో మెగా ఫ్యామిలీలోనూ సంతోషం వెల్లి విరిసింది. ఇక అప్పటి నుంచి అటు ఉపాసన కానీ, ఇటు రామ్‌ చరణ్‌ కానీ సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్‌ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో జరిగి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో చెర్రీతో కలిసి ఉపాసన పాల్గొన్న విషయం తెలిసిందే.

తమ ఇంట అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం మెగా ఫ్యామిలీ ఆతృతగా ఎదురు చూస్తోంది. మోగా ఫ్యాన్స్ కూడా ఆ ఘడియల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పుట్టబోతున్న బిడ్డ గురించి ట్విట్టర్ వేదికగా ఉపాసన ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ‘తనకు సంక్రాంతి అంటే మాతృత్వాన్ని ఆస్వాదించడమే’ అని ఆమె ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభాన్ని సెలెబ్రేట్ చేసుకోవడమే తనకు సంక్రాంతి అని చెప్పారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version