దేశంలో డిజిటిల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు, నగదు రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో మోదీ ప్రభుత్వం యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలో యూపీఐని నిర్వహిస్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా యూపీఐ ట్రాన్సాక్షన్‌లలో తగ్గుదల కనిపిస్తోంది. ప్రజలు యూపీఐని పెద్దగా వాడడం లేదని వెల్లడైంది. తాజాగా ఎన్‌పీసీఐ విడుదల చేసిన గణాంకాలే ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
మార్చి నెలలో రూ.5,04,886 కోట్ల విలువైన 2.73 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా, ఏప్రిల్ లో ఆ సంఖ్య కొంత తగ్గింది. ఏప్రిల్ నెలలో రూ.4,93,663 కోట్ల విలువైన 2.64 బిలియన్ల ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయి. ఇక మే నెలలో రూ.4,90,638 కోట్ల విలువైన 2.53 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే యూపీఐ లావాదేవీల సంఖ్య చాలా తగ్గినట్లు కనిపిస్తుంది.
Switch to UPI enabled apps to make easy, safe and instant payments. #BHIMUPI #DigitalPayments @dilipasbe pic.twitter.com/ZePoLOy5Aj
— NPCI (@NPCI_NPCI) June 1, 2021
అయితే దేశవ్యాప్తంగా అనేక చోట్ల లాక్ డౌన్‌లు అమలు అవుతుండడంతోపాటు థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌పై 30 శాతం ట్రాన్సాక్షన్ల కోటాను విధించడం వల్లే యూపీఐ ద్వారా జరగాల్సిన ట్రాన్సాక్షన్ల సంఖ్య తగ్గిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆ కోటాను మరింతగా పెంచేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లాక్‌డౌన్‌లను ఎత్తేసినా యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.