హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో అందుబాటులోకి ఉప్పల్‌ స్కైవాక్‌

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పల్‌ జంక్షన్‌లో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ నిర్మాణాన్ని తలపెట్టింది హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ. దీనికి మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు.

కరోనా కారణంగా రెండేళ్లు పనులకు ఆటంకం ఏర్పడింది. కొంతకాలంగా పనులు ఊపందుకున్నాయి. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌, రామంతాపూర్‌ రహదారులు, మెట్రో స్టేషన్‌తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు.

ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా స్కైవాక్‌ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్‌కు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కల్పించనున్నారు. ఈ నడక వంతెనతో జంక్షన్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.


Read more RELATED
Recommended to you

Latest news