లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఊర్వశి రౌటేలా..!

-

త్వరలోనే ఊర్వశి రౌటేలా లోక్సభ ఎన్నికల్లోకి రాబోతోందని టాక్ వచ్చింది పలువురు రాజకీయ నాయకులతో పాటుగా సెలెబ్రెటీలు కూడా ఈ మధ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ హీరోలు హీరోయిన్లతో పాటుగా చాలామంది పాలిటిక్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఊర్వశీ రౌటేలా ఒక ఈవెంట్ కి హాజరై బయటకి వస్తుండగా ఆమెని ఒక యాంకర్ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది.

మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్ లోకి రావడానికి అని అడిగింది. రాజకీయాలని మీరు ఫాలో అవుతారని కూడా ఆమె ప్రశ్నించింది. నాకు ఆల్రెడీ టికెట్ వచ్చింది నేను డిసైడ్ అవ్వాలి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది అని అన్నారు. ఆ తర్వాత అవునా మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే ఏమో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి నేను రావాలా వద్దా అని చెప్పింది. కానీ ఎక్కడ టికెట్ వచ్చింది రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ నుండి పోటీ చేయబోతోంది అనేది మాత్రం ఏమీ చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version