అమెరికాలోని అర్కెనాన్స్ లో జరిగిన ఓ సంఘటన అందరిని విస్తుపోయేలా చేసింది. ఓ వేటగాడు జింకని వేటాడాలని అడవిలోకి వెళ్లి, అదే జింక చేతిలో మరణించడం కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళ్తే. ధామస్ అనే ఓ 66 ఏళ్ళ వ్యక్తి మంచు పర్వతాల వద్దకి జింకని చంపడానికి వెళ్ళాడు. తనకి కనపడిన జింకని చూసి వెంటనే తుపాకీ తో కాల్చాడు. దాంతో అది పడిపోయింది.
చనిపోయిన జింకని తీసుకువద్దామని ఆ జింక వద్దకి వెళ్ళాడు. అతడి రాకని గమనించిన జింక ఒక్కసారిగా లేచి అతడిపై తన వాడిన కొమ్ములతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దాంతో అతడు కేకలు పెడుతూ తన భార్యని పిలిచాడు. దాంతో అతడి భార్య వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు మార్గ మధ్యంలోనే మరణించాడు. దాంతో అందరూ షాక్ కి లోనయ్యారు
ఈ మరణంపై స్పందించిన పోలీసు అధికారి మాట్లాడుతూ ధామస్ మరణం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను.అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళేల్లోనే చనిపోయారు అంటూ విచారం వ్యక్తం చేశారు. అతడి శరీరంపై తీవమైన గాయాలు ఉన్నాయని కూడా గుర్తించమని తెలిపారు. అయితే గాయపడిన జింక కోసం ఇప్పుడు వెతుకులాటలు మొదలు పెట్టారు రక్షణ సిబ్బంది.